Saturday, November 23, 2024
HomeతెలంగాణHuzurnagar: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి

Huzurnagar: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హుజూర్ నగర్ నియోజక వర్గ అధ్యక్షులు దుగ్గి ఉషశ్రీ అన్నారు.

- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట హుజూర్ నగర్ నియోజకవర్గ 6 టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నానికి నిరసనగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ వారు మాట్లాడుతూ….కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. 6టీవీ వెచ్చ సందీప్ పై కత్తులతో హత్యాయత్నం చేసిన వ్యక్తులను, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో జర్నలిస్టుల రక్షణ చట్టంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, సిఐ చరమందరాజు లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దొంతగాని రాజరమేష్, త్రిపురం రమేష్ రెడ్డి, పండ్ల నాగరాజు, వట్టికూటీ మహేష్, జెట్టి తేజస్, దేవరం వెంకటరెడ్డి, కాంపాటి సందీప్, వసుపు జయరాజు, తండు నరేష్, పండు వెంకన్న, వి6 నరేష్, కిత రామనాథం, రాంప్రసాద్ గౌడ్, జానీ పాషా, నాగుల్ మీరా, ఆత్కూరి వెంకటేష్ ఇట్టుమల్ల రామకృష్ణ, నరేందర్, పెందుర్తి సతీషు, నక్క నరేష్ బండి నాగేశ్వరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News