వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకాలు చేపట్టింది. ఆయా జిల్లాలకు కేటాయించిన కోఆర్డినేటర్ల పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. తాజా నియామకాల ప్రకారం.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఈయన మంత్రిగా ఉన్నారు.
అలాగే.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి.. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్ రెడ్డి లను నియమించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కో ఆర్డినేటర్లుగా బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్ది రామ చంద్రారెడ్డి..కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమర నాథ్ రెడ్డిని నియమించారు.
వీరిలో మాజీ మంత్రులుగా పనిచేసినవారితో పాటు.. కొత్తగా మంత్రి పదవి వచ్చిన వారు ఉన్నారు. ఈ కో ఆర్డినేటర్లందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.