Harsha Sai| యూట్యూబర్ హర్షసాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్షసాయిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తనను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ బాధితురాలు కూడా పిటిషన్ వేసింది. దీంనతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అతడికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కాగా యూట్యూబ్ వీడియోలు చూసే చాలా మందికి హర్షసాయి తెలిసే ఉంటుంది. పేదలకు డబ్బులు దానం చేస్తూ ఆ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు. మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తూ చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ఇటీవల బెట్టింగ్ యాప్‌లను విపరీతంగా ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ హర్షసాయిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై అతడు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్‌లోకి వచ్చిన నటి, హర్షసాయి ఓ పార్టీలో కలిశారు.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శారీరకంగా దగ్గరయ్యారు.
ఇదిలా ఉండగానే హర్షసాయి తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టగా.. అందులో సదరు నటిని హీరోయిన్‌గా తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ యువతి ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అయితే.. సినిమా కాపీరైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలతో తనను బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేయడం ప్రారంభించారు. విచారణలో హర్షసాయి ఆచూకీ తెలియకపోవడంతో లుక్అవుట్ నోటీసులు కూడా జారీచేశారు.