Wednesday, October 30, 2024
HomeతెలంగాణBe careful while enjoying fire works: బాణసంచా కాల్చేవేళ.. జాగ్రత్తలిలా..

Be careful while enjoying fire works: బాణసంచా కాల్చేవేళ.. జాగ్రత్తలిలా..

దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు కాల్చే 2, 3 రోజులలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే 200 రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల పని తీరుపై క్రాకర్స్ ప్రభావం చూపుతాయని వైద్యులు హనుమంతరావు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు. ఆరోగ్యంపై దీపావళి క్రాకర్స్ ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎవరివైనా ఊపిరితిత్తులు ఇప్పటికే వ్యాధి తాలూకు దుష్పభావాలు కలిగి ఉంటే, క్రాకర్స్ వెలువరించే దట్టమైన విషపూరితమైన పొగకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మరింత దెబ్బతినడం సహా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చునన్నారు.
శ్వాస కోస వ్యవస్థకు హాని
‘క్రాకర్స్ హానికరమైన వాయు కాలుష్యాలను కలిగి ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు పదార్థాలు శ్వాసకోశ లైనింగ్ (శ్లేష్మ పొర)కు హాని కలిగిస్తాయి. ఆస్తమా, అలర్జీ రోగులకు సమస్యగా పరిణమిస్తుంది. ఇప్పుడు వీరికి మాత్రమే కాకుండా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా ప్రమాదకరంగా మారుతుంది భారీ పరిమాణంలో ఫైర్ క్రాకర్స్ కు సంబంధించిన పొగ గాలిలో వ్యాపిస్తున్న సమయంలో ఈ రోగులు ఇంటి లోపలే ఉండడం శ్రేయస్కరమన్నారు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..

కోవిడ్ వ్యాధితో బాధపడిన కొందరు రోగుల ఊపిరితిత్తుల పనితీరులో మార్పు వచ్చింది. దీపావళి సందర్భంగా, పరిసర గాలిలో నలుసు పదార్థం ఇతర అస్థిర కర్బన సమ్మేళనాలు అపారంగా పెరుగుతాయి. దీనికి గురైనప్పుడు, దీంతో తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు

పెద్దవాళ్ల పర్యవేక్షణ అవసరం

టపాకాయలు కాల్చే సమయంలో ప్రతి చిన్నారి వద్ద పెద్దవారు ఒకరు ఉండి తప్పనిసరిగా వారిని పర్యవేక్షించాలని ఏవైనా కాలిన గాయాలు, ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. టపాసును కాల్చే సమయంలో పిల్లలని ఒంటరిగా వదలవద్దు. రక్షణ ఇచ్చే కంటి అద్దాలను ఉపయోగించాలి. టపాసు వెలిగించే వ్యక్తి నుంచి మిగిలినవారు తగినంత దూరంలో ఉండాలి. క్రాకర్స్ వెలిగించడానికి పొడవైన కొవ్వొత్తి లేదా కాకర పువ్వొత్తిని ఉపయోగించాలని.
చేతిలో పట్టుకుని టపాకాయలను వెలిగించవద్దని. వాటిపై వంగి టపాకాయలను వెలిగించవద్దని, సీసా, రేకు డబ్బా లేదా బోర్లించిన కుండవంటి పాత్రలో పెట్టి టపాకాయలను వెలిగించడం ప్రమాదకరం. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా, కొంతసేపు ఆగి వెళ్లాలని. టపాసులను జేబులో పెట్టుకోవద్దని. క్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్ లేదా వదులుగా ఉన్న దుస్తులు కాక, మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించాలని.
భారీ గాలులు వీచే సందర్భాల్లో బాణసంచా కాల్చవద్దని టపాసులు కాల్చేదగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఉంచుకోవాలని చర్మం కాలినట్లయితే, కాలినచోట క్రీమ్ ఆయింట్మెంట్ నూనెను పూయకుండా ఎక్కువ నీరు పోయాలని. గాయపడిన వారిని వెంటనే సొంత వైద్యం చేయవద్దని తీవ్రమైన కాలిన గాయాలైతే, మంట ఆర్పిన తర్వాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి, వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

సిహెచ్ సి వైద్యులు డాక్టర్ హనుమంతరావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News