Sunday, October 6, 2024
Homeహెల్త్Sugar Scrube: షుగర్ స్క్రబ్ తో మెరిసే చర్మం

Sugar Scrube: షుగర్ స్క్రబ్ తో మెరిసే చర్మం

షుగర్ స్క్రబ్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిని ఇంటి పట్టునే చేసుకోవచ్చుకూడా. చక్కెర పలుకులతో చేసే స్క్రబ్ చర్మానికి మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. షుగర్ స్క్రబ్ ని చేతులతో లేదా బ్రష్ ను ఉపయోగించి వేసుకోవచ్చు. ముఖానికి సాఫ్ట్ బ్రౌన్ షుగర్ వాడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. సుగర్ స్క్రబ్ ను ముఖంపై అప్లై చేసుకునేటప్పుడు దెబ్బతిన్న చర్మంపై మిస్ కాకుండా రాయాలి. షుగర్ స్క్రబ్ ను ముఖంపై రాసుకొని చేతి వేళ్లతో చర్మంపై సర్కులర్ మోషన్ లో తిప్పుతూ మసాజ్ చేయాలి. ఇలా స్క్రబ్ తో ఐదు లేదా పది నిమిషాల పాటు మసాజ్ ను తప్పనిసరిగా చేయాలి.

- Advertisement -

తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు పోయి శుభ్రంగా ఉంటుంది. చక్కెరలో అధికపాళ్లల్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో దాగున్నఎక్స్ ఫోయిలేటింగ్ గుణాల కారణంగా ఇది చర్మంపై శక్తివంతమైన స్క్రబ్ గా పనిచేస్తుంది. పూర్వకాలంలో గాయాలు మానడానికి చక్కెర వాడేవారు. ఇందుకు కారణం చక్కెరలోని యాంటిమైక్రోబియల్ గుణాలే. ఎథనాల్, గ్లైసిరోల్, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో వాడే పదార్థాలలో చక్కెర ఇట్టే కలిసిపోతుంది. చక్కెరకు నీళ్లల్లో తొందరగా కరిగిపోయే స్వభావం ఉంది. దీన్ని ముఖానికి రాసుకున్నప్పుడు నీళ్లతో కడుక్కుంటే ఎంతో సులభంగా పోతుంది. చక్కెర స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఫోటోయేజింగ్ డేమేజ్ ను దీంతో తగ్గించవచ్చు. అంతేకాదు చర్మంపై ముడతలను కూడా బాగా తగ్గిస్తుంది.

చర్మం దురదపెట్టకుండా చక్కెర నిరోధిస్తుంది. చక్కెర స్క్రబ్స్ చర్మాన్ని మలినాల నుంచి శుభ్రం చేయడమే కాకుండా ముఖానికి మంచి లిఫ్టింగ్ ఎఫెక్టు ఇస్తుంది. సెల్యులైట్ ను అడ్డుకుంటుంది. కొలస్ట్రాల్ సల్ఫేట్ తో కలిపి చక్కెరను చర్మానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండి దాని పనితీరు బాగుంటుంది. చర్మం దెబ్బతినకుండా కూడా ఇది పరిరక్షిస్తుంది. అంతేకాదు వయసు మీద పడినప్పుడు కనిపించే చర్మం ముడతలు పడడం లాంటి లక్షణాలను సైతం ఇది తగ్గిస్తుంది. షుగర్ బాడీ స్క్రబ్ శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను కూడా పోగొడుతుంది. చక్కెర స్క్రబ్ చర్మాన్ని మెరిపించడమే కాకుండా చర్మం టెక్స్చెర్ బాగుండేట్టు చూస్తుంది.

అతినీలలోహితకిరణాలు, కాలుష్యం, పురుగుమందులు వంటి వాటి వల్ల కూడా వయసు మీదపడ్డట్టు కనపడతాం. వీటివల్ల చిన్న వయసులోనే ముసలివాళ్లల్లా కనిపించే అవకాశం ఉంది. సుగర్ బాడీ స్క్రబ్ వాడడం వల్ల రోజూ చర్మంపై చేరే విషతుల్యమైన మలినాలను పోవడంతో పాటు బాగా చర్మంపై ఈ స్క్రబ్ బాగా పనిచేస్తుంది. చూడడానికి యూత్ ఫుల్ గా తాజాదనంతో కనిపిస్తారు. పొడిచర్మం ఉన్నవారు బాడీ స్క్రబ్ వాడకూడదనే అపోహ చాలమందిలో ఉంది. కానీ ఇది తప్పుడు అభిప్రాయం.

షుగర్ బాడీ స్క్రబ్ చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది.ఆ తర్వాత చర్మంపై ఆయిల్ ని రాస్తే చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ అందుతుంది. దీంతో చర్మం మ్రుదువుగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News