Thursday, October 31, 2024
HomeNewsJai Hanuman: 'జై హనుమాన్' థీమ్ సాంగ్ కూడా వచ్చేసింది..

Jai Hanuman: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ కూడా వచ్చేసింది..

Jai Hanuman|దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) దర్శకత్వం వహిస్తున్న ‘జై హనుమాన్'(Jai Hanuman) మూవీ నుంచి దీపావళి కానుకగా మరో అప్‌డేట్ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రను కన్నడ స్టార్ హీరో రిషభ్‌ శెట్టి(Rishab Shetty) పోషిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన థీమ్‌ సాంగ్‌ను కూడా విడుదల చేసింది. ఓజెస్‌ అందింJai Hanuman: ‘జై హనుమాన్’ మూవీ థీమ్ సాంగ్ కూడా వచ్చేసింది..చిన స్వరాలకు కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించగా.. సింగర్ రేవంత్‌ ఆలపించారు. ఈ థీమ్ సాంగ్ సినిమాపై భక్తి భావం పెంచేలా ఉంది.

- Advertisement -

ఈ ఏడాది విడుదలైన హనుమాన్ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే ఇందులో ఆంజనేయస్వామి పాత్రలో ఎవరు నటించనున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. దీపావళి పర్వదినంఎ పురస్కరించుకుని ఆ ఉత్కంఠకు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరదీశాడు. కన్నడ స్టార్ హీరో రిషభ్‌ శెట్టి(Rishab Shetty) ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రాముడి విగ్రహాన్ని పట్టుకుని రిషభ్ శెట్టి కూర్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచాలను పెంచేసింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

కాగా ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రూపుదిద్దుకోనుంది. ‘హనుమాన్‌’కి మించి వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ ఇప్పటికే ప్రకటించారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సీక్వెల్‌లో హీరో కాదని, సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌(PVCU)లో భాగంగా రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News