Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nagababu: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. నాగబాబు ట్వీట్ వైరల్

Nagababu: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. నాగబాబు ట్వీట్ వైరల్

Nagababu| తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన చైర్మన్‌గా టీవీ5 న్యూస్‌ ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన సీనియర్ నేత నాగబాబు(Nagababu) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.

- Advertisement -

“హిందు ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే TV5 ఛైర్మన్ B.R నాయుడు గారికి T.T.D ఛైర్మన్ హోదా రావడం శుభసూచికం అన్నారు నాగబాబు. సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల‌ సంతోషంగా ఉంది. మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠని మరింత మెరుగుపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే జనసేన తరపున టీటీడీ సభ్యులుగా ఎన్నికైన బురగపు ఆనంద సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డి గారికి, ఇతర సభ్యులుగా ఎన్నికైన అందరికి నా శుభాకాంక్షలు చెబుతున్నాను” అని రాసుకొచ్చారు.

కాగా టీటీడీ చైర్మన్‌(TTD Chairman) పదవిని నాగబాబుకు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2024 సాధారణ ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని నాగబాబు భావించారు. ఈ మేరకు అక్కడే ఉంటూ స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అయితే తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. దీంతో నాగబాబుకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు.

అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాగబాబుకు ఉన్నతమైన పదవి ఇస్తారని అంతా భావించారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు బీఆర్ నాయుడికి ఆ పదవి ఇవ్వడంతో జనసైనికులు తీవ్ర అసంతృపిత్తో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో నాగబాబు బీఆర్ నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా ఉంది. ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వనున్నారని.. అందుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వలేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News