పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ తెలిపారు. దీపావళి రోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్ సంభాషణ అక్స్ కెటిఅర్ లో ఈ మేరకు కెటిఅర్ తెలిపారు. పలువరు ప్రత్యేకంగా ఈ అంశంలో కెటిఅర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.