Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే.. ప్రభుత్వంపై షర్మిల...

YS Sharmila: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే.. ప్రభుత్వంపై షర్మిల విమర్శలు

YS Sharmila| దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సిక్స్ పథకంలోని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఓవైపు ఉచితంగా సిలిండర్లను .. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నుంచి ఆ డబ్బులు లాక్కుంటున్నారని మండిపడుతున్నాయి. తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ పథకం అమలు తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

- Advertisement -

“3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్… విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోంది. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా .

దీపం – 2 కింద వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు. గత వైసిపి చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదు. గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా.

మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా. రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది” అని షర్మిల ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News