Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్Congress: థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లాభం

Congress: థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లాభం

థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే రాజకీయ లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తేనే బీజేపీ ఓటమి సాధ్యమంటూ రాయ్ పూర్ లోని కాంగ్రెస్ మేథోమథనం సదస్సు అభిప్రాయపడింది.

- Advertisement -

సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలను కలుపుకు పోయే చొరవ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని, ఈ వ్యూహంతోనే బీజేపీని వచ్చే ఎన్నికల్లో చిత్తు చేయచ్చంటోంది. సెక్యులర్, సోషలిస్టు శక్తులన్నీ ఏకం కావాలని, ఇలాంటి వారికోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వెతుకుతుందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో కలిసివచ్చే ప్రాంతీయ పార్టీలను తాము కలుపుకుని పోతామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో సమర్థవంతమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అనేది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈమేరకు రాయ్ పూర్ ప్లీనరీలో రాజకీయ తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News