Sunday, May 25, 2025
Homeట్రేడింగ్Pranitha launches 'Swayam' designer studio: 'స్వయం' డిజైనర్ స్టూడియో

Pranitha launches ‘Swayam’ designer studio: ‘స్వయం’ డిజైనర్ స్టూడియో

కస్టమ్ మేడ్..

స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రణీత సుభాష్ మాట్లాడుతూ.. ఒకప్పుడు డిజైనర్ దుస్తులు డిజైనర్లు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారు కాదని, కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్ డిజైనర్ లో తమ ఖ్యాతిని చాటుతున్నారని అన్నారు. సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను మేళవిస్తూ అద్భుతంగా సృష్టిస్తున్నారన్నారు. శుభకార్యాలు, అందాల వేడుకలు ఏవైనా ఇప్పుడు డిజైనర్ దుస్తులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయన్నారు. తాను సైతం డిజైనర్ దుస్తులను అవసరానికి అనుగుణంగా ధరిస్తానని చెప్పారు.

నిర్వాహకురాలు యమునా బదిత మాట్లాడుతూ.. తాను లండన్ లో మాస్టర్ చేశానని డిజైనర్ రంగంపై తనకున్న అభిలాషతో ఈ స్టోర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము అందించే డిజైన్లు సౌకర్యవంతంగా అందాన్ని ఇనుమడింపజేసేలా ఉంటాయని అన్నారు. స్వయం అంటే సంస్కృతంలో స్వంతం అని అర్థం అన్నారు. సొంతంగా ప్రేమించడం మనం ధరించిన వాటిని ఇష్టపడటం కోసం ఈ పేరును ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఆన్లైన్లో తమ సేవలు అందించామని, ఇప్పుడు నగరవాసులకు ఈ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఖాజా గూడాలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు.

స్వయం డిజైనర్ స్టూడియో గురించి..

యమునా బదితాచే స్థాపించబడిన, స్వయం డిజైనర్ స్టూడియో స్వీయ వ్యక్తీకరణను జరుపుకునే అనుకూలీకరించదగిన ఫ్యాషన్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. చక్కదనం, సౌకర్యాలపై దృష్టి సారించి, బ్రాండ్ హైదరాబాద్‌లో తన మొదటి స్టోర్‌తో ఫ్యాషన్ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News