Friday, November 22, 2024
HomeతెలంగాణHuzurnagar: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు చారిత్రాత్మకం

Huzurnagar: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు చారిత్రాత్మకం

స్కూల్ శంకుస్థాపన..

గత ఏడాది రెసిడెన్షియల్ స్కూళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వ 70 కోట్లు మాత్రమే కేటాయి తమ ప్రభుత్వం ఒకే ఏడాది ఏకంగా 5 వేల కోట్లు కేటాయిస్తూ పేద పిల్లలపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క అన్నారు. ప్రగతిశీల భావాలతో అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నట్టు డిప్యుటీ సీఎం భట్టీ వివరించారు.

- Advertisement -

ఈ రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలే కానీ పాలకులు పంచుకోవడానికి కాదని, గత పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. వారు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయటమేంటని భట్టీ దుయ్యబట్టారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం స్థానిక సభలో ఆయన ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో గత పాలకులు పదేళ్లపాటు ఈ వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వివరించారు. 2007 తర్వాత నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం దీపావళి పండుగ రోజు 7.50 లక్షల మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

మూడు నుంచి ఏడవ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు 950 నుంచి 1330కి పెంచామని, 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు 1100 ఉండగా వాటిని 1540కి పెంచామని తెలిపారు. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థుల మెస్ చార్జీలు 1500 ఉండగా 2100 పెంచామన్నారు. నేటి మన బిడ్డలే రేపటి పౌరులు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు 55 నుంచి 175 కు పెంచామన్నారు. మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు 75 నుంచి 150 కి పెంచామన్నారు. 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థినిల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి కాస్మోటిక్స్ చార్జీలను 62 రూపాయల నుంచి 200 పెంచామన్నారు.

పేదల భవిష్యత్ కోసం ఎంత ఖర్చైనా సై..
పేద బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొనడం విద్యారంగానికి చారిత్రాత్మకం అని అభివర్ణించారు. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని వర్గాల విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అందరూ ఒకేచోట చదువుకునేలా అద్భుతంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా..

ఈ పాఠశాలలో అద్భుత క్రీడా ప్రాంగణాలు, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుందని, మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా 25 ఎకరాల ఆహ్లాదకర వాతావరణంలో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని వివరించారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాల ప్రాంగణంలో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ మంత్రి మండలి ఆలోచించి ఇంటర్నేషనల్ స్కూల్స్కు డిజైన్లు ఇచ్చే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్ కు బాధ్యతలు అప్పగించామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. పాఠశాలలు పెట్టడమే కాదు వాటికి నిధులు కేటాయించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వం గత ఏడాది రేజించల్ పాఠశాలలకు 70 కోట్లు మాత్రమే కేటాయించింది, కానీ మా ప్రభుత్వం ఇదే రంగానికి ఒకే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఐదు వేల కోట్లు కేటాయించామంటే పేద పిల్లల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో మీ అందరూ గమనించాలని అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలోనే ప్రారంభం..

ప్రతి పైసా పోగు చేసి ప్రజల కోసం ఖర్చు పెడతాం సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం పేదల కోసం కష్టపడతామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడి పనులు అక్కడే నిలిచి ఉండగా మేము అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతులు సాధించామని తెలిపారు. ఏడాదిలో మూడు సార్లు పర్యటించి రెండు యూనిట్లు సింక్రనైజ్ చేశామని తెలిపారు.

ఎస్ఎల్బీసీ మేమే చేశాం..

ఎస్ ఎల్ బి సి సొరంగం ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేయిస్తామని, నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక్క కిలోమీటర్ సొరంగం తొవ్వకం పూర్తి చేయలేదని విమర్శించారు. మొత్తం 42 కిలోమీటర్ల సొరంగ మార్గం కాగా 32 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే తవ్వితే.. మిగిలిన 10 కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్ కూడా పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ పాలకులు పూర్తి చేయలేదని విమర్శించారు.
మేం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష సమావేశం పెట్టి ప్రతి నెల ఎంత పని జరిగితే అంత మొత్తానికి వెనువెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పామని, 20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తాను ఎస్ ఎల్ పి సి దగ్గర సమీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News