తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, తదితరులు మడికొండకు చేరుకోగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె డాక్టర్ నిఖితా రెడ్డి, డాక్టర్ అవినాష్ రెడ్డిల వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మడికొండకు చేరుకున్నారు. మడికొండలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన వారికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ,స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, తదితర ప్రముఖులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు.
మడికొండలోని సత్య సాయి గార్డెన్ లో నిర్వహించిన డాక్టర్ నిఖితా రెడ్డి – డాక్టర్ అవినాష్ రెడ్డి ల వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు నూతన వధూవరులకు పుష్పగుచ్చాలను ఇచ్చి ఆశీర్వాదాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.