Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

AP TET Results| ఏపీ టెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పరీక్షల్లో 1,87,256 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారికి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన వాయిదా పడింది.

- Advertisement -

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహించారు. కాగా టెట్‌ స్కోర్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. టీచర్ల నియామక పరీక్షలో దీనికి 20 శాతం వెయిటేజీ కూడా ఉండటంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ నెల 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News