Friday, November 22, 2024
HomeతెలంగాణBRS MLAs Arrest: మాజీ మంత్రి హరీష్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

BRS MLAs Arrest: మాజీ మంత్రి హరీష్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

BRS MLAs Arrest| బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై మాజీ మంత్రి హరీష్(Harishrao) రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు భైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో హరీష్‌రావు సహా మండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లోపలకు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

- Advertisement -

కాగా గత పదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు పోరుబాటకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఆదివారం రాత్రి అందరూ నగరానికి చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వారంతా సమావేశమవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని నిర్బంధించారు. మరికొందరిని అరెస్ట్ చేశారు.

అయితే మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR).. మరో మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా ఖండిస్తూ ఎక్స్ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎప్పుడూ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉందన్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను పోలీసులు వెంటనే విడుదల చేయాలని.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News