కాంగ్రెస్ పార్టీ శాసన సభ ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో భాగంగా ఈ నెల ఆరవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
కుల గణనతో వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని నేతలు పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారిన కానీ వెనుకబడిన తరగతుల వారి జీవన ప్రమాణాల్లో మార్పు మాత్రం రాలేదని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ లో కుల గణన చేసి వెనుక బడిన తరగతుల వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు బోయినపల్లిలోని గాంధీ ఐడియాజి సెంటర్లో రాహుల్ గాంధీ, కుల గణన నేపథ్యంలో మేధావులు, విద్యార్థి సంఘాలు, వివిధ కుల సంఘాలతో సమావేశం అవుతున్న సభను విజయవంతం చేయాలని మంత్రివర్యులు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, కాలే యాదయ్య, బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.