Friday, November 22, 2024
HomeతెలంగాణPaleru: రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు

Paleru: రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు

సమీక్షలో..

రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదోళ్లు, బహు పేదోళ్లు ఇలా కేటగిరిల వారీగా పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

రెండో విడతలో రేషన్ కార్డు తప్పనిసరి..

రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొంగులేటి సోమవారం సమావేశమైయ్యారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై సంబంధిత అధికారులు, నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉ ండాలని అప్పుడే స్థానిక స్థితిగతులపై పట్టుకలిగి ఉంటారని పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వారు పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శులపై ఎంపీడీవోల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై నిర్ధాక్షణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అర్హులను గుర్తించండి..

ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో వికలాంగుల, వృద్ధాప్య, వితంతు మొదలగు పెన్షన్ కు అర్హులైన వారిని గుర్తించాలని, అనర్హులకు ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వొద్దని అన్నారు. అర్హులకు ఎంతమందికి ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని. పొరపాటున ఒక అనర్హుడికి ఇచ్చినా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆ అనర్హుడిని ఉదాహరిస్తూ అర్హత లేని వారు ఇంకెందరో పెన్షన్ తమకూ ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తారన్నారు. కావున వాటి మీద దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాబోవు ఏడాదిలోపు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీరుతుందని.. అత్యవసరమైనవి తన దృష్టికి తెస్తే తక్షణమే నిర్మాణం చేపట్టేలా చూస్తానని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News