Tuesday, November 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే..?

Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సోమవారం ఒక్కరోజే శ్రీవారిని 74,651 మంది భక్తులు దర్శించుకోగా.. వీరిలో 24,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

మరోవైపు ఇవాళ నాగుల చవితి పండుగ సందర్భంగా శ్రీవారి పెద్దశేష వాహన సేవ ఉంటుంది. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై మాడవీధులలో మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఇక కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. వసతి గృహాల నుంచి అన్న ప్రసాదాల వరకూ అంతా భక్తులతో రద్దీగా మారింది. భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉంటే వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ. నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News