KTR| పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మూసీ సుందరీకరణ కాదు.. రైతుల కన్నీళ్లు చూడాలని సూచించారు.
కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..
గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు.
గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు.
ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు.
నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు – ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు.
నీ మూసీ ముసుగులు కాదు – కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.
పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు – పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు.
నీ కాసుల కక్కుర్తి – నీ కేసుల కుట్రలు కాదు – పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు.
దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడు అని ఆయన రాసుకొచ్చారు.