Friday, November 22, 2024
HomeతెలంగాణMedicover Hospital: మెడికవర్ ఆస్ప్రతిలో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. రూ.4లక్షలు ఇస్తేనే..!

Medicover Hospital: మెడికవర్ ఆస్ప్రతిలో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. రూ.4లక్షలు ఇస్తేనే..!

Medicover Hospital| సమాజంలో వైద్య వృత్తిని దైవంగా భావిస్తారు. జబ్బు వస్తే ఆసుపత్రికి వచ్చే ప్రజలు డాక్టర్లను దేవుడిలా కొలుస్తారు. ప్రాణాలు నిలబెట్టే పవిత్రమైన వృత్తిలో ఉన్న కొంతమంది డాక్టర్లు ఆ వృత్తికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాసుల కక్కుర్తి మాయలో పడి ప్రజలను పీక్కుతింటున్నారు. ఇలాంటి వైద్యులను దృష్టిలో పెట్టుకునే రెండు దశాబ్దాల క్రితం ఠాగూర్ మూవీలో ఓ సీన్ తీశారు. అయినా కానీ కాసుల వైద్యులకు బుద్ధి రాలేదు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారు చనిపోయినా.. డబ్బులు కోసం కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఠాగూర్ సీన్ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

- Advertisement -

కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. అమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగా నిన్న(మంగళవారం) రాత్రి మృతి చెందింది. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.3 లక్షలకు పైగా డబ్బు కుటుంబసభ్యులు చెల్లించారు. అయితే మరో రూ. 4 లక్షలు కడితేనే ట్రీట్‌మెంట్ కొనసాగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకున్నా కూడా యాజమాన్యం లెక్క చేయలేదు.

దీంతో కుటుంబసభ్యులు ఎంతో కష్టపడి ఉదయం మరో రూ.లక్ష కట్టారు. ఆ వెంటనే నాగప్రియ చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డబ్బు కోసమే మృతి వార్తను దాచిపెట్టారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు మామూలు అయిపోయాయని.. వైద్యానికి వచ్చిన రోగుల బంధువులను మానసికంగా డబ్బు కోసం హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News