Wednesday, November 6, 2024
Homeనేషనల్Siddaramaiah: ముడా స్కామ్.. లోకాయుక్త ఎదుట హాజరైన సిద్ధరామయ్య

Siddaramaiah: ముడా స్కామ్.. లోకాయుక్త ఎదుట హాజరైన సిద్ధరామయ్య

Siddaramaiah| కర్ణాటకలో సంచలనం సృష్టించిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ల్యాండ్ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు. మైసూర్‌లో భూ కేటాయింపుల విషయంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో అక్టోబర్ 25న సిద్ధరామయ్య సతీమణి పార్వతిని సైతం లోకాయుక్త అధికారులు విచారించిన విషయం విధితమే.

- Advertisement -

కాగా తన భార్య పార్వతికి ముడా మంజూరు చేసిన భూమికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)పై అవినీతి కేసులు పెట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో జస్టిస్ నాగప్రసన్న తోసిపుచ్చారు. ఆ తర్వాత, ముడా స్థలాల కేటాయింపులకు సంబంధించి అవినీతి, మోసం, ఫోర్జరీ ఆరోపణలపై కర్ణాటక లోకాయుక్త సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

సిద్ధరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కేటాయించడంతో ముడాలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా ఈ అభియోగాలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా సీఎం సతీమణి తన పేరు మీద కేటాయించిన స్థలాలను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News