Wednesday, November 6, 2024
HomeతెలంగాణTelangana : ప్రారంభమైన సమగ్ర కుంటుంబ సర్వే.. అధికారులు అడిగే ప్రశ్నలు ఏవో తెలుసా?

Telangana : ప్రారంభమైన సమగ్ర కుంటుంబ సర్వే.. అధికారులు అడిగే ప్రశ్నలు ఏవో తెలుసా?

- Advertisement -

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వే ప్రారంభించి, వివరాలు సేకరిస్తున్నారు.

అయితే చాలా మంది అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే అంటే ఏంటి? ఇంటికి సర్వేకు వచ్చే వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ వివరాలు సేకరిస్తారు అంటూ కాస్త అయోమయంలో ఉన్నారు. కాగా, అసలు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు సేకరించే వివరాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఈ ఇంటింటి సర్వేలో అధికారులు మొత్తం 75 ప్రశ్నలు సంధించనున్నారంట. అందులో 56 ముఖ్యమైన ప్రశ్నలు ఉండగా,19 అనుబంధ ప్రశ్నలు ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా, సర్వేలు కులం,మతం, కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు. అందులో ఉద్యోగంలో ఉన్నవారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు ఎంత మంది? వ్యాపారం, విద్య, స్థిర, చరాస్తులు, వార్షిక ఆదాయం లాంటి వివరాలతో పాటు, గత ఐదేళ్లుగా వారు ఎలాంటి సంక్షేమ పథకాల లబ్ధి పొందారు, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతి నిధులుగా ఉన్నారా? వారికి ద్విచక్రవాహనం ,ఫ్రిజ్ లాంటివి ఏవైనా ఉన్నాయో తెలుసుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News