తెలంగాణలో సమగ్ర కుంటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ ఎంసీ పరిధిలో సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే మొదలవుతోంది. ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. అసమానతలను తొలిగించి, అందరికీ న్యాయం చేయడం కోసమే ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తుంది, ప్రభుత్వ అధికారుల విధులకు ఎవరూ ఆటంకం కలిగించకూడదు, ఒక వేళ ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మకూడదని, మీ నుంచి మేము సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచుతాము అంటూ ఆయన ప్రజలకు తెలియజేశారు.