బరువు వేగంగా తగ్గి స్లిమ్ గా కనిపించాని చాలామంది కోరుకుంటారు. దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని అనుసరిస్తే శరీర బరువు వేగంగా తగ్గడమే కాదు ఆరోగ్యకరంగా కూడా శరీరం ఉంటుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది వారానికి ఒక కిలో తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. హెల్తీ డైట్ మాత్రమే తీసుకోవాలి. అందులో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చక్కెరలకు దూరంగా ఉండాలి. ఇవి ఎలా చేయాలంటే…
కాలరీలను తొందరగా తగ్గించుకోవాలని తాపత్రయపడొద్దు.అలా చేస్తే మీ శరీరంలో ప్రొటీన్లు, ఎసెన్షియల్ ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు ఒకేసారి తగ్గి శరీరారోగ్యం ప్రమాదంలో పడుతుంది. శరీరానికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. శరీరంలో రక్తప్రవాహం బాగా జరగాలి. బోలెడు ఖనిజాలు కావాలి. ముఖ్యంగా ఫ్యాట్స్, ప్రొటీన్లు వంటి న్యూట్రియంట్లు చాలా అవసరమవుతాయి. అందుకే ఆహారంలో మార్పులను దశల వారీగా చేపట్టాలి తప్ప తొందరపడకూడదు.
ఆరోగ్యకరమైన డైట్ లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. రోజులో మీరు తినే ఆహారంలో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు శరీర బరువును తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిని తినడం వల్ల తొందరగా కడుపునిండి చిరుతిళ్ల మీదకు మనసు పోదు. శరీరంలోని ఫ్యాట్ తగ్గడానికి కూడా ఇవి సహాయపడుతాయి. వేపుడు ఆహారపదార్థాలపై ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ప్రొటీన్లు ఉన్న ఆహారం పరిమితంగా తీసుకోవడం వల్ల శరీర బరువు వేగంగా తగ్గుతుంది.
లంచ్, డిన్నర్ కు క్వినోవా లేదా అమరాంత్ లాంటివి తింటే మంచిది. బ్రేక్ ఫాస్టుగా బీన్స్ సలాడ్, మొలకలు తింటే మంచిది. ఒక కప్పు సూపు లేదా సలాడ్ లో ఎనిమిది గ్రాముల ప్రొటీను ఉండేలా తాజా పచ్చి బటానీలు వేసుకుని తింటే కూడా మంచిది. క్యారెట్, బెల్ పెప్పర్ స్టిక్స్ ను పెరుగులో ముంచుకుని స్నాక్స్ లా తింటే ఎంతో బాగుంటుంది.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, షుగరులను కూడా తినొద్దు. వీటిని తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం వస్తుంది. పైగా శరీరంలోని బ్లడ్ షుగర్ ప్రమాణాలు కూడా బాగా పెరుగుతాయి. అందుకే వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి.
ప్రోసెస్డ్ ఫుడ్స్ కు కూడా స్వస్తి పలకాలి. మీరు కొనే ఫుడ్ ఉత్పత్తుల మీద ఉండే లేబుల్ ని ముందుగా చదవడం అలవాటుచేసుకోవాలి. వాటిల్లో యాడిటివ్స్, ఆర్టిఫీషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ వంటివి ఉంటే వాటిని దూరంపెట్టడం మంచిది. వేపుళ్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. డీప్ ఫ్ఱైడ్ చిప్స్, స్ప్రింగ్ రోల్స్, జంక్ ఫుడ్ లను పూర్తిగా మానేయాలి. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫ్రైడ్ ఫుడ్స్ లోని ఫ్యాట్స్ ని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని పెంచడమే కాదు ఫ్రీ రాడికల్స్ కూడా దెబ్బతింటాయి.
నిత్యం వ్యాయామం చేయాలి. డాన్సింగ్, యోగ, పైలేట్స్, సైక్లింగ్, బ్రిస్కు వాక్ ఏవైనా సరే వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా చేయాలి. వ్యాయామాలు చేయడం వల్ల ఫీల్ గుడ్ ఎండోర్ఫిన్స్ విడుదలయి శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్ వల్ల కూడా మీ శరీరం మరింత ఎనర్జీని పొందుతుంది.
నిద్ర బాగా పోవాలి. నిద్ర బాగా పోతే శరీరంలోని అలసట పోయి రోజంతా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు.ఒక స్టడీలో రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అర్థరాత్రి టైములో చిరుతిళ్లకు అలవాటు పడతారని వెల్లడైంది. అది కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తినడానికి ఇష్టపడతారుట. ఆలస్యంగా నిద్రపోవడమనేది ఆకలి మీద సైతం ప్రభావం చూపుతుంది. శరీరంలోని హార్మోన్ల మీద కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. తక్కువగా నిద్ర పోవడం వల్లకోర్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ బాగా పెరుగుతుంది. అందుకే రాత్రిపూట తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు నిత్యం నిద్రపోవాలి. అప్పుడు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే శరీర బరువు సహజంగా తగ్గుతారు.
శరీరానికి తగినంత నీరును ఎప్పుడూ అందిస్తుండాలి.నీళ్లు బాగా తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు 30 శాతం పెరుగుతుంది. అంతేకాదు నీటిని బాగా తాగడం వల్ల ఆకలి వేయదు. అలా బరువు తగ్గడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది.
రోజూ పెందరాళే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కాలరీలు కరిగి శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. రాత్రిపూట కాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే అవి ఫ్యాట్ గా మారి పెద్ద ప్రమాణంలో శరీరంలో పేరుకుంటాయి. దీంతో లావు అవుతాం.
మిరపకాయలు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆకలి కూడా వేయదు. కాలరీలు పెరగడమనే బాధ ఉండదు.
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకుంటే కూడా బరవు పెరగరు.