వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కాగా తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్యకేసులో ఈయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెయిలు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.
AP HIGH COURT : ఏపీ హైకోర్టులో నందిగం సురేష్ కు ఎదురు దెబ్బ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES