Wednesday, November 6, 2024
HomeతెలంగాణKTR: ఆంధ్రా కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: ఆంధ్రా కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR| ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుమ్మక్కు అయ్యారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి మూసీ నదిలోకి నీటిని నింపే ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుందని.. కానీ ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇప్పుడు రూ.5650 కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. ఇందులో రేవంత్ రెడ్డి,రాహుల్ గాంధీకి ఎంత ముడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగాయని.. నేడు ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. అలాగే ఏ సంస్థలను అయితే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు చెప్పారో.. వారికే ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు.

- Advertisement -

ప్రపంచంలో పేరుగాంచిన ఎల్ అండ్ టీ(L&T), NCCని కాదని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, రాఘవ కన్ష్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారని విమర్శించారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తుచేశారు. అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ విమర్శించారని తెలిపారు. మరి అలాంటి కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు.. నేటికి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని డిమాండ్ చేశారు. కానీ దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) .. మేఘా సంస్థకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే తాము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలకు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవన్నారు. కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి పొంగులేటి హెచ్చరిస్తున్నారని.. వీరు ప్రభుత్వం నడుపుతున్నారా లేదా సర్కస్ నడుపుతున్నారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తప్పులపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టుపెడుతున్నారని.. త్వరలోనే రెండు పార్టీల కుట్రలను ప్రజల ముందు బహిర్గతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News