విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ అభ్యర్థిని ఫిక్స్ చేశారు. వైసీపీ సీనియర్ నేత చిన్న అప్పలనాయుడును అభ్యర్థిగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతల ఏకాభిప్రాయంతో ఆయన పేరును ప్రకటించారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ… విశాఖ ఎమ్మెల్సీ సీటులో విజయం సాధించినట్టే, విజయనగరం ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా దక్కించుకోవాలన్నారు. విజయనగరంలో స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్య 753 ఉండగా… ఇందులో వైసీపీ ప్రతినిధులు 592 మంది ఉన్నారు.
- Advertisement -
కాగా, అప్పలనాయుడుకి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు.