Saturday, April 5, 2025
HomeతెలంగాణSamala Hema got doctorate: సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమకు ఓ.యూ. డాక్టరేట్

Samala Hema got doctorate: సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమకు ఓ.యూ. డాక్టరేట్

రాజకీయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చదువులోనూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగుతున్నారు జీ.హెచ్.ఎం.సి. పరిధిలోని 145వ డివిజన్ సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ.

- Advertisement -

తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తూ..

తన ఆశయాలను సాధించుకోవడమే కాకుండా తల్లిదండ్రుల ఆకాంక్షలు సైతం నెరవేరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ డాక్టరేట్ పొందారు. ఈ మేరకు ఓ.యూ. అధికారులు డాక్టరేట్ లు పొందిన వారి జాబితాను విడుదల చేశారు. డాక్టరేట్ పట్టా పొందిన కార్పొరేటర్ హేమ సామలకు బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు మీడియా మిత్రులు, అభిమానులు, సీతాఫల్ మండి డివిజన్ వాసులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News