Thursday, November 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3గంటలకు పైగా సమయం తీసుకుంటుంది. అటు బుధవారం ఒక్కరోజే శ్రీవారిని 66,163 మంది భక్తులు దర్శించుకోగా.. 25,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86కోట్లుగా వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

మరోవైపు నవంబర్ 8వ తేదీన శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 8 రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. ఈ క్రమంలోనే న‌వంబ‌రు 8న సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అలాగే న‌వంబ‌రు 9న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను రద్దుచేసినట్లు తెలిపింది. దీంతో తోమాల‌, అర్చన సేవ‌లు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News