తెలంగాణ ప్రభుత్వం పలువురు డిఎస్పీ అధికారులను బదిలీ (DSP’s Transfer) చేసింది. బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో తక్షణమే రిపోర్ చేయాలని డీజీపీ నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ అయ్యారు. జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్బీ గా ఉన్న జి మహేష్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా ఉన్న బి రామానుజంను కాగజ్ నగర్ ఎస్డీపీఓ గా బదిలీ చేశారు.
కాగజ్ నగర్ ఎస్డీపీఓ గా ఉన్న ఏ. కరుణాకర్ ను ఆసిఫాబాద్ ఎస్డీపీఓ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆసిఫాబాద్ ఎస్డీపీఓ గా ఉన్న పీ.సదయ్యను బదిలీపై హైదరాబాద్ లోని చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని డీజీపీ సూచించారు. వనపర్తి డీఎస్పీ, డీసీఆర్బీగా ఉన్న కే.క్రిష్ణ కిశోర్ ను తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్డీపీఓ గా బదిలీ చేశారు. తొర్రూర్ ఎస్ఏపీవోగా ఉన్న వీ. సురేష్ ను హైదరాబాద్ లోని చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. నిర్మల్ డీఎస్పీ, డీసీఆర్బీగా ఉన్న పీ.రవీందర్ రెడ్డిని ఖమ్మం ఏసీపీ, సీసీఆర్బీగా బదిలీ చేశారు. ఖమ్మం ఏసీపీ, సీసీఆర్బీగా ఉన్న డీ.ప్రసన్న కుమార్ ను మెదక్ ఎస్డీపీఓ గా బదిలీ చేశారు.