Friday, November 22, 2024
HomeతెలంగాణFormula E Race | ఫార్ములా ఈ రేస్ ఆరోపణలపై స్పందించిన KTR

Formula E Race | ఫార్ములా ఈ రేస్ ఆరోపణలపై స్పందించిన KTR

ఫార్ములా ఈ రేస్‌ (Formula E Race) నిర్వహణపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. నిర్వహణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుపై వివరణ ఇచ్చారు. క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయటమనేది సర్వసాధారణం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో కూడా జరిగిన ఫార్ములా 4 అనే రేసు కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశారన్న ఆయన… మేము ఈ-రేస్‌కు కోసం ప్రభుత్వం తరపున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే అని వెల్లడించారు.

- Advertisement -

ఫార్ములా ఈ రేస్‌ (Formula E Race) ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని కేటీఆర్ తెలిపారు. అదే కాకుండా అమర్ రాజా బ్యాటరీస్, హ్యుండాయ్ అనే సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి అని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మన హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలని మేము ఈ-రేస్‌ను ఒక అడుగుగా ప్రయత్నం చేశామని కేటీఆర్ వెల్లడించారు. గతంలో పెట్టిన జీనోమ్ వ్యాలీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్‌ను రాజధానిగా చేసిందన్న కేటీఆర్… ఈ-రేస్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కేంద్రం అంటే హైదరాబాద్‌ను గుర్తు చేయాలని అనుకున్నామన్నారు.

ఇంకా ఆయన చెప్పారో ఆయన మాటల్లోనే…

మొట్టమొదటి కారు రేస్ 1894లో పారిస్‌లో జరిగింది

ఫార్ములా వన్ మొదటి రేస్ 1946లో ఇటలీలో జరిగింది

ఫార్ములా వన్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ రేస్ నిర్వహించేందుకు దేశాలే పోటీ పడతాయి

దేశానికి ఫార్ములా వన్ రేసు రావాలన్న కల ఈనాటిది కాదు

రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు గారు కూడా 2003లో ఎఫ్1 రేస్ హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రయత్నం చేశారు

రేవంత్ రెడ్డి గురువు చేయని పనిని మేము చేశాం

అప్పట్లో ఎఫ్ 1 కోసం గోపనపల్లిలో 400 ఎకరాల భూమి సేకరించి డెడికేటేడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు

అందుకు సంబంధించి భూ సేకరణపై కేసులో కోర్టులో నడుస్తోంది

యూపీలో మాయావతి ప్రభుత్వం మొత్తానికి ఎఫ్ 1 రేసును నొయిడాలో జరిపారు

ఎఫ్ 1 రేసు కోసం 2011 లోనే దాదాపు రూ. 1,700 కోట్లు ఖర్చు చేశారు

రాజీవ్ గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్, అదే విధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లో జరిగాయి

కామన్వెల్త్ గేమ్స్ కోసం యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 70,600 కోట్లు

ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసింది

ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లు జరిగిన సరే ప్రభుత్వం వాటికోసం ఖర్చు చేస్తోంది

ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం కూడా రూ. 103 కోట్లు ఖర్చు చేశారు

ఎఫ్ 1 రేసు జరుగుతుంది కనుకే మొనాకో అనే చిన్న దేశం ప్రపంచం మొత్తానికి తెలిసింది

జమ్మూ కశ్మీర్‌లో మోటార్ రేసింగ్ జరిగితే అక్కడ కశ్మీర్‌ను ప్రమోట్ చేస్తూ మోడీ గారు ట్వీట్ చేశారు

రాహుల్ గాంధీ గారికి కూడా మోటార్ రేసింగ్ అనే అభిరుచి ఉంది. దాన్ని నేను అభినందిస్తున్నా

ఎఫ్ 1 రేసు కోసం నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారు

భవిష్యత్ తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది

ఫార్ములా రేసింగ్‌లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్ ను ఫార్ములా ఈ-రేస్ అంటారు

ఎఫ్ 1 రేసు రాని కారణంగా మేము ఫార్ములా ఈ-రేస్ తెచ్చే ప్రయత్నం చేశాం

ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఈ నగరాల చోట హైదరాబాద్‌ను చేర్చాలని మేము ఈ-రేస్‌ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం

మేము ఈ-రేస్ తెచ్చేందుకు చేసి ప్రయత్నంలో సియోల్, జోహన్నస్‌బర్గ్‌ను తలదన్ని మన హైదరాబాద్‌కు ఈ-రేస్‌ను తెెచ్చాం

ఫార్ములా రేసింగ్‌ను మేము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం

మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గారి కూడా ఈ-రేస్‌కు సంబంధించిన కమిటీలో మెంబర్‌గా చేశాం

తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనుకున్నాం

గతంలో బీవైడీ అనే సంస్థ చైనా నుంచి వచ్చేది ఉండే. కానీ చైనాలో గొడవల కారణంగా రాలేదు

బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాం. మరో సంస్థ రూ. 1200 కోట్లు పెట్టుబడులు పెట్టింది

ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు పెట్టుబడులు తెచ్చాం

ఫార్ములా ఈ-రేస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ప్రాచుర్యం పెరుగుతోంది

ఈ-రేస్‌ను రేస్‌గా కాకుండా మొత్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ యూనివర్సిటీ టెక్నాలజీని పెంపొందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం

గతంలో మేము ఈ-రేస్‌ను ప్రమోట్ చేసేందుకు ముంబై వెళితే అక్కడే కేంద్ర మంత్రులు ఈ-రేస్‌ను హైదరాబాద్‌కు మీరు తీసుకెళ్లారు అంటూ ఓపెన్‌గా అన్నారు

ఈ-రేస్ కారణంగా రూ. 700 కోట్ల ప్రయోజనంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాం

మొబిలిటీ వీక్ ద్వారా కూడా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయి

మేము నాలుగేళ్లు, త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News