Friday, November 22, 2024
HomeతెలంగాణYadadri | యాదాద్రి పేరు మార్పు... సీఎం కీలక ఆదేశాలు

Yadadri | యాదాద్రి పేరు మార్పు… సీఎం కీలక ఆదేశాలు

మూసీ పునరుజ్జీవ పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి (Yadadri) ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముగిసిన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ యాదాద్రి (Yadadri) పేరు మార్పుపై కీలక ప్రకటన చేశారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దేవస్థానాన్ని యాదాద్రికి బదులుగా భక్తులు పిలుచుకునే విధంగానే అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలి

- Advertisement -

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని, గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేదని, కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో భారీ ట్విస్ట్

విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు సీఎం రేవంత్. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని తేల్చి చెప్పిన సీఎం… మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News