సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా సంగెం నుంచి రేవంత్ పాదయాత్ర (Revanth Padayatra) మొదలుపెట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం నాగిరెడ్డిపల్లిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రేవంత్ పాదయాత్ర (Revanth Padayatra) లో పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Also Read : యాదాద్రి పేరు మార్పు… సీఎం కీలక ఆదేశాలు
మూసీ పర్యటనలో భాగంగా భీమలింగం వద్ద సీఎం రేవంత్ బోటులో ప్రయాణించి నీటిని పరిశీలించారు. అలాగే, మూసీ నీటిని బాటిల్ లోకి తీసుకుని చెక్ చేశారు. భీమలింగానికి సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం భీమలింగాన్ని గుండెలకి హత్తుకున్నారు. పాదయాత్రకంటే ముందు సీఎం రేవంత్ ఈరోజు ఉదయం యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని యాదాద్రికి బదులుగా భక్తులు పిలుచుకునే విధంగానే అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలి అధికారులకు సూచించారు.