బీఆరెస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు.. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన యాదాద్రి జిల్లాలో మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ… హరీష్ రావు, కేటీఆర్ లకు రేవంత్ సవాల్ (Revanth Challenge) విసిరారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని తేల్చి చెప్పారు.
బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్న వాళ్లు పేర్లు ఇవ్వండి… మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా అంటూ రేవంత్ ఛాలెంజ్ (Revanth Challenge) చేశారు. “బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తా” అంటూ కేటీఆర్, హరీష్ రావు లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా? నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా? అంటూ కేసీఆర్ ని నిలదీశారు.
Also Read : మూసీ పర్యటనలో సీఎం ఆవేదన
మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్, నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ… మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని కేసీఆర్ ని రేవంత్ హెచ్చరించారు. “బీఆర్ఎస్ నాయకులు వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది. ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. బిల్లా, రంగా లకు సవాల్ విసురుతున్నా. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలుపెడతా. బిల్లా, రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం” అంటూ రేవంత్ హరీష్ రావు, కేటీఆర్ లకు సవాల్ విసిరారు.