Deputy CM Pawan Kalyan| ఏపీలో డ్రగ్స్ మాఫియా(Drugs Maphia)పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ మాఫియాను కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంపై స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా తయారైంది. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని తేలింది. , గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలి” అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.