Friday, November 22, 2024
HomeతెలంగాణKomireddi Jyothi | కాంగ్రెస్ లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

Komireddi Jyothi | కాంగ్రెస్ లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి (Komireddi Jyothi) అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం అనారోగ్య కారణాలతో బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. 70 ఏళ్ళ జ్యోతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గతేడాది ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మరణించిన విషయం తెలిసిందే. ఏడాదిలోనే రాములు, జ్యోతి మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

కొమిరెడ్డి జ్యోతి (Komireddi Jyothi) మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జ్యోతి మరణం పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని… వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : టాలీవుడ్ ప్రముఖులపై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు

జ్యోతి రాజకీయ ప్రస్థానం…

జ్యోతి భర్త రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 1994లో మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 1998లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఎంపీగా ఎన్నికవ్వడంతో మెట్‌పల్లి ఎమ్మెల్యే సీటు ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. జ్యోతి ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వెంకట్రమణారెడ్డిపై విజయం సాధించారు. ఆమె 17 నెలల పాటు శాసనసభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అఖిల భారత మహిళా ఎమ్మెల్యేల సంఘం నాయకురాలిగా ఉంటూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె తీవ్రంగా కృషి చేశారు. 1999 సంవత్సరంలో సోనియా గాంధీని విదేశీ మహిళ అని బీజేపీ విమర్శించినందుకు కొమిరెడ్డి జ్యోతి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ కార్యక్రమంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు పాల్గొన్నారు. కాగా, కొమిరెడ్డి జ్యోతి, రాములు దంపతులకు ముగ్గురు కుమారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News