Friday, November 15, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: భవిష్యత్ టూరిజందే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: భవిష్యత్ టూరిజందే: సీఎం చంద్రబాబు

CM Chandrababu| భవిషత్య్ అంతా టూరిజందే అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ పున్నమిఘాట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో కలిసి ‘సీ ప్లేన్’ టూరిజం సేవలు ప్రారంభించారు. అనంతరం సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్‌’ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. పెరుగుతున్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఐటీ అంటే ఆనాడు తనను ఎగతాళి చేశారని.. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉన్నారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గత ఐదేళ్లగా విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. వైసీపీ నేతలు పొగొట్టిన ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్‌ ప్రయాణం ఉంటుందని భరోసా ఇచ్చారు. సీ ప్లేన్ ఆపరేషన్స్‌కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News