Thursday, November 14, 2024
HomeతెలంగాణKCR: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్(వీడియో)

KCR: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్(వీడియో)

KCR| సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి, కూల్చడానికి కాదు అని వ్యాఖ్యానించారు. అది చేస్తాం.. ఇది చేస్తామనే పిచ్చిమాటలు మాకు రావా..? అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయిందని.. కానీ ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సేవ చేయడానికే కానీ ప్రతిపక్ష నేతలకు ఇష్టమొచ్చినట్లు తిట్టడానికి కాదన్నారు.

- Advertisement -

ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి కానీ కూలగొడతామంటూ భయపెడతారా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువగా చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు ప్రజలు మనపై నమ్మకంతో ఉన్నారని.. పార్టీ నాయకులూ అందరూ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. అరెస్టులకు అసలు భయపడేది లేదని పేర్కొన్నారు.

కాగా శుక్రవారం మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మూసీ సుందరీకరణ కాకుండా అడ్డుపడితే బుల్డోజర్స్ వేసి తొక్కిస్తాం.. జైలులో వేస్తామనే వ్యాఖ్యలపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. 2023 ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం జనాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఘోరంగా ఓడిపోయింది. దీంతో గత 6 నెలలు నుంచి కేసీఆర్ బయటకు రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News