యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం గోవర్ధనగిరిదారి అలంకార సేవలో యాదగిరీశుడు దర్శనమిచ్చాడు. రాత్రి సింహవాహనం పై భక్తులకు దర్శనమివ్వనున్నాడు నరసింహుడు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.