Saturday, November 23, 2024
HomeNewsBJP Manifesto: మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

BJP Manifesto: మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

BJP Manifesto| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra elections) మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. తాజాగా బీజేపీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో దీనిని విడుదల చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమి తమ వాగ్దానాలను విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని మరోసారి పునరుద్ఘాటించారు.

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక హామీలు ఇవే..

స్కిల్ సెన్సస్, స్టార్టప్‌ల అభివృద్ధి: ఇందుకోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు
ఉద్యోగ కల్పన: యువతకు 25 లక్షల ఉద్యోగాలు
నైపుణ్య గణన: రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో సమగ్ర నైపుణ్య గణన.
లఖపతి దీదీ పథకం విస్తరణ: ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న “లఖపతి దీదీ” పథకాన్ని 50 లక్షల మంది మహిళలకు విస్తరించి ఆర్థికంగా బలోపేతం చేయడం.
సీనియర్ సిటిజన్లకు పెన్షన్ పెంపు: వృద్ధులకు అందించే నెలవారీ పెన్షన్ రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు
ఎరువుల జీఎస్టీ వాపసు: రైతులు ఎరువులపై చెల్లించిన జీఎస్టీ(GST)ని తిరిగి చెల్లించడం
పరిశ్రమలకి వడ్డీ లేని రుణాలు: రూ.25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు.
వ్యవసాయ రుణాల మాఫీ: రైతులకు రుణమాఫీ
ధరల స్థిరీకరణ: నిత్యావసర వస్తువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News