Thursday, November 14, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP vs YCP: నిక్కర్ మంత్రి లోకేష్.. కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్.. టీడీపీ, వైసీపీ...

TDP vs YCP: నిక్కర్ మంత్రి లోకేష్.. కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్.. టీడీపీ, వైసీపీ ట్వీట్ వార్

TDP vs YCP | ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య వాడివేడీ రాజకీయాలు సాగుతున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటూ పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్(Jagan) అధికారంలో ఉన్నప్పుడు పెన్ను, పేపర్ల కోసం రూ.9.84 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఇందుకు టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసింది.

- Advertisement -

నిక్కర్ మంత్రి నారా లోకేష్‌..

“నిక్క‌ర్ మంత్రి లోకేష్, నువ్వు మంత్రివి ఎలా అయ్యావు? సీఎం కార్యాల‌యంలో పెన్నులు, పేప‌ర్ల కోసం కోట్లు దుర్వినియోగం అంటూ దుష్ప్రచారం చేస్తున్న నిన్ను ఏ జైల్లో పెట్టాలి? నీకు ఏ శిక్ష వేయాలని వైసీపీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించింది. నీ బ‌తుకంతా కూడా వైయస్ జ‌గ‌న్ పై, గత వైసీపీ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేయ‌డ‌మేనా? నిక్క‌ర్ మంత్రీ.. ప్ర‌తిసారీ నీ అజ్ఞానాన్ని ఇలా బ‌య‌ట‌పెట్టుకోవ‌డానికి సిగ్గుగా లేదా? అని లోకేష్ ట్వీట్ కు వైసీపీ ఘాటు రిప్లై ఇచ్చింది. ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం అంటే అక్కడే ఐదారుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు.. వాళ్ల దగ్గర స్టాఫ్ ఉంటారు. వారు రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు.

సీఎం ఆధ్వర్యంలో అధికారులతో వందలాది రివ్యూ మీటింగులు జరుగుతాయి. అధికారులు కూడా మీటింగ్ లు పెడతారు. వాళ్లకు అవసరమైన స్టేషనరీ చూసుకోవాలి. స్టేష‌న‌రీ, నాన్ స్టేష‌న‌రీ కిందికి పెన్నులు, పేప‌ర్ల‌తో పాటు ప్రింటర్లు, క్యాట్రిడ్జ్, స్టాక్ రిజిస్ట‌ర్లు, రైటింగ్ ప్యాడ్స్ లాంటివి చాలా వ‌స్తాయి. వీటికి సంబంధించి ప్ర‌భుత్వ అధికారులే చూసుకుంటారు. ఎన్ని అవ‌స‌ర‌మో అన్ని మాత్ర‌మే తీసుకుంటారు. జగన్ పై, ఆయన ప్రభుత్వంపై ఊరికే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డం కాదు నిక్క‌ర్ మంత్రి.. నీకు ద‌మ్మూ, ధైర్యం ఉంటే విచార‌ణ చేసి వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టాలి”అంటూ లోకేష్‌కు సవాల్ విసురుతూ వైసీపీ ట్వీట్ చేసింది.

కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్..

“కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్.. అసెంబ్లీ అంటే భయపడే పులివెందుల పిల్లి. నీకు ఆత్రం ఎక్కువ తప్ప, ఏమి చెప్తున్నావో నీకే అర్ధం కావటం లేదు.. ఒక పక్క పెన్నులు, పేపర్ల కోసం కోట్లు ఖర్చు పెట్టలేదు అని జగన్ అంటాడు, ఇంకో పక్క స్టాఫ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖర్చు పెట్టాను అంటావ్. బుర్రలో గుజ్జు పెంచుకునే మాత్రలు వాడాలని, రూ.9.84 కోట్లతో కొన్న పెన్నులతో స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్చుకోవాలి” అంటూ టీడీపీ కౌంటర్ పోస్ట్ చేసింది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News