Thursday, November 14, 2024
Homeనేషనల్PM Modi: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు: ప్రధాని మోడీ

PM Modi: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు: ప్రధాని మోడీ

PM Modi| ఓబీసీలను కులాల వారీగా విభజించేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో ఐక్యత ఉన్నప్పుడే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఓబీసీలు, గిరిజనులు, దళితుల మధ్య ఐక్యత లేకపోవడంతో కాంగ్రెస్ వరుసగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉందన్నారు. కానీ ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చాక లోక్‌సభలో ఇంతవరకు 250 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోలేదని తెలిపారు. ఓబీసీలు విడిపోతే మీ వాయిస్ బలహీనపడుతుందన్నారు. ‘ఏక్ రహేంగే తో సేఫ్‌ రహేంంగే’ అని సూచించారు.

- Advertisement -

జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), కాంగ్రెస్ పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించే అవకాశం ఉందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యతిరేకమని తెలిపారు. సోనియా, మన్మోహన్ పదేళ్ల పాలనలో జార్ఖండ్ రాష్ట్రానికి రూ.80వేల కోట్లు ఇస్తే తాము రూ.3లక్షల కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ఇండియా కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370(Article 370)ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు కోరుతున్నాయని.. అదే జరిగితే మళ్లీ భారత సైనికులు ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏడు దశాబ్దాలుగా అక్కడ రాజ్యాంగం అమలులో లేదని.. కానీ తమ హయాంలో భారత రాజ్యాంగం పేరుతో తొలిసారిగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారని మోడీ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News