Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Assembly | మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly | మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూన్ లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నడిచిన రాష్ట్రం.. ఇకపై పూర్తిస్థాయి బడ్జెట్ తో పట్టాలెక్కనుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -


ఈ సమావేశాల్లో ఏపీ సర్కార్ 2024- 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయింపులు జరపనుంది. రూ.2.9 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్ ని అగ్రికల్చరల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరిలో రూ. 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ బడ్జెట్ లో రెవెన్యూ రాబడి అంచనాలు రూ. 2.05 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇప్పటివరకు రెవెన్యూ రాబడి రూ. 68 వేల 463 కోట్లు మాత్రమే. రాబడి ఖర్చులు దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ సవరణ ఉండబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News