Thursday, November 14, 2024
HomeAP జిల్లా వార్తలుఅమరావతిAP Budget: ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

AP Budget: ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

AP Budget| అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అంతకుముందు చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజధాని రైతులను పలకరించి అభినందించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు.

కాగా రూ.2.9లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్ అగ్రికల్చరల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరిలో రూ. 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ బడ్జెట్ లో రెవెన్యూ రాబడి అంచనాలు రూ. 2.05 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇప్పటివరకు రెవెన్యూ రాబడి రూ. 68 వేల 463 కోట్లు మాత్రమే. రాబడి ఖర్చులు దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ సవరణ ఉండబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News