Thursday, November 14, 2024
HomeతెలంగాణCM Revanth Reddy | దేశంలో ఉన్నవి రెండే పరివార్ లు -రేవంత్

CM Revanth Reddy | దేశంలో ఉన్నవి రెండే పరివార్ లు -రేవంత్

దేశంలో ఉన్నవి రెండే పరివార్ లు… ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తుంటే ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారన్నారు.

- Advertisement -

హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం,ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం అని మైనారిటీలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు

“దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మోదీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలి. దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయండి. దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు” అని సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News