Friday, November 22, 2024
HomeతెలంగాణRevanth - KCR | కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth – KCR | కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్ (KCR) కి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు” అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి రేవంత్ ఘాటుగా బదులిచ్చారు. సోమవారం ఆయన అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ AVIM లకు నియామక పత్రాలు అందించారు.

- Advertisement -

కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. “దీపావళి పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని కొందరు బుకాయించే ప్రయత్నం చేశారు. లీడర్ అంటే లీడ్ చేసేవాడు.. అందరికీ రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలి.. కానీ పండగ వస్తే డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారు కాదు. అలాంటి వారిని సామజిక బహిష్కరణ చేయాలని యువతను కోరుతున్నా. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచించాలి” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…

1కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.

నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.

49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.

రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు.

21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు..

35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది

కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.

మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం..

విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం..

ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.

త్వరలో వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం..

పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం..

తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం..

మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది.

ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి..

బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News