Phone Tapping| తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులు అరెస్టై జైలులో ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. అయితే ఆయనను తెలంగాణకు తీసుకొచ్చి విచారణ చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇటీవలే అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్‌కార్డు లభించండతో తెలంగాణకు తీసుకొచ్చి విచారణ చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు. సోమవారం నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందించగా.. తాజాగా నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేశారు. దీంతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.