Ambati Rambabu| వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు పోలీసులకు పట్టించడం చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి వలగపూడి అనితపై పల్నాడు జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీంతో రాజశేఖర్ రెడ్డిపై నూజివీడులో పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా నకిరేకల్లులోని అతడి ఇంటికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ గుంటూరులోని తన ఇంట్లోనే రాజశేఖర్ ఉన్నాడని తెలిపారు. పోలీసులకు చేతనైతే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబటి పోలీసులకు సవాల్ విసిరి కార్యకర్తను అరెస్ట్ చేయించడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర చర్చగా మారింది.