Botsa-Atchannaidu| అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైపీపీ సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విమర్శించారు. మృతుల విషయంలో స్పష్టత లేదన్నారు. అయితే బొత్స విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) మండిపడ్డారు.
అనంతరం బొత్స విమర్శలపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదేళ్లలో వాటర్ ట్యాంక్లలో బ్లీచింగ్ కూడా వేయలేదని ఫైర్ అయ్యారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.4వేలకోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి తమ ప్రశ్నలకు సరైన సమాధానం రావడం లేదంటూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు.