Sunday, November 24, 2024
HomeతెలంగాణCrime: దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలు చేసిన ప్రియుడు

Crime: దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలు చేసిన ప్రియుడు

Crime| సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని దంపతులను మోసం చేశారు. ఉద్యోగం పేరుతో మోసపోయామని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని మోసం చేసిన ఓ జంట మధ్య డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ప్రియుడు ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను 20 ముక్కలుగా చేసి పంట పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

అసలు ఏం జరింగిందంటే… జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్నకుమార్ అనే దంపతులకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని.. కొమ్ముగూడెంకు చెందిన వీరభద్రం, స్వాతి జంట రూ.16లక్షలు తీసుకున్నారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ కట్టాల్సి వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన పార్వతి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రత్నకుమార్ కుటుంబానికి డబ్బులు ఇస్తామని ప్రియురాలు మాట ఇచ్చింది. అయితే అప్పటి నుంచి డబ్బుల విషయంలో స్వాతి, ప్రియుడు వీరభద్రం మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరూ గుర్తుపట్టలేని విధంగా 20 ముక్కలు చేశాడు. ముక్కలను పంట పొలాల్లో విసిరేశాడు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అక్కడి వెళ్లిన పోలీసులు..ఒక మూటలో ముక్కలుగా వున్న మహిళ మృత దేహం చూసి ఆశ్చర్యపోయారు. ఆ ముక్కలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా స్వాతిది అని తేలింది. నిందితుడు వీరభద్రంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News